Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేను తనకన్నా ముందుగా భోజనం చేశానన్న కోపంతో ఒక నటి క్యారియర్ ను తన్నేసింది: 'డబ్బింగ్' జానకి

  • ఆ నటి పేరు చెప్పడం ఇష్టం లేదు
  • అహంభావంతో అలా చేసింది 
  •  తగిన ఫలితం అనుభవించింది
నాటకాల్లోను .. టీవీ సీరియల్స్ లోను .. సినిమాల్లోను విభిన్నమైన పాత్రలను పోషించిన 'డబ్బింగ్' జానకి, తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. తాజాగా ఆమె 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ, "ఒక సినిమా షూటింగుకి అవుట్ డోర్ కి వెళితే, ఒక నటికీ .. నాకు కలిపి ఒక రూమ్ ఇచ్చారు. మొదటి నుంచి కూడా నేను పెందరాళే భోజనం చేసి .. పెందరాళే నిద్రలేస్తాను. మా కోసం భోజనం క్యారియర్ వచ్చింది .. నాకు సరిపడా నేను తినేసి పడుకున్నాను.

ఆ నటి అసిస్టెంట్ తిరిగి క్యారియర్ సర్దేసి ఉంచింది. ఆ నటి తాగుతూ పేకాడి ఆలస్యంగా రూమ్ కి వచ్చింది. "అప్పుడే ఈవిడ తినేసి పడుకుందా .. ఈవిడ తినేసిన క్యారియర్లో నుంచి నేను అన్నీ తీసుకోవాలా?" అంటూ ఆ క్యారియర్ ను కాలుతో తన్నేసింది. దాంతో ఆ క్యారియర్లోని భోజనమంతా రూమ్ లో చిందరవందరగా పడిపోయింది. అంతటి అహంకారానికి పోయినందుకు ఆ తరువాత ఆ నటి తగిన ఫలితాన్ని అనుభవించింది. ఆ నటి పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు గానీ .. ఇప్పటికీ ఆమె ఇండస్ట్రీలోనే వుంది " అని చెప్పుకొచ్చారు.
dubbing janaki

More Telugu News